Featured News

మొదటి రోజునే 50లక్షల hits తో రికార్డు సాధించిన సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘లింగా’

మొదటి రోజునే 50లక్షల hits తో రికార్డు సాధించిన సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘లింగా’

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తున్నచిత్రం ‘లింగా’ ఈ చిత్రం లో సూపర్ స్టార్ రజని కి జోడిగా అందాల భామలు అనుష్క శెట్టి , సోనాక్షి సిన్హా నటిస్తున్నారు , ఈ చిత్రానికి
ప్రముఖ దర్శకుడు k.s.రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు, క్రేజీ ప్రొడ్యూసర్ రాక్ లయన్ వెంకటేష్ నిర్మాత గా రాక్ లయన్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై సౌత్ ఇండియా లో అత్యంతభారీగా తెరకెక్కుతున్న చిత్రం గా లింగా కి ఇప్పటికే యావత్ ప్రపంచమంతా భారి అంచనాలున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ
అందిస్తున్నాడు, ఏ.అర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇండియా లోని అతి ఉత్తమమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ లింగా మొదటి లుక్ నుంచే చరిత్ర
సృష్టిస్తుంది. వినాయక చవితి సందర్భం గా విడుదల చేసిన ఈ మొదటి లుక్ కి మొదటి రోజునే 50 లక్షల హిట్స్ రావటం ఈ సినిమా కి మొదటి రికార్డు గా చెప్పవచ్చు ..
ఈ సినిమా ఆడియో ని దీపావళి కి రిలీజ్ చెసి సినిమా ని సూపర్ స్టార్ రజని కాంత్ పుట్టిన రోజు సందర్భం గా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు..
ఈ సందర్భం గా చిత్ర నిర్మాత మాట్లాడుతూ : “ మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకం గా తెరకెక్కుతున్న చిత్రం లింగా ., సూపర్ స్టార్ రజని కాంత్ గారితో మేము చిత్రం చేయటం చాలా హ్యాపీ గా ఉంది, అయన సరసన
అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు , రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఇలా భారత దేశం లో ఉన్నతమైన సంకేతిన నిపుణుల తో ఈ చిత్రం చేస్తున్నాము, k.s.రవి కుమార్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాము, రవికుమార్, రజని కాంత్ గారి కాంబినేషన్ లో వచ్చిన ముత్తు, అరుణాచలం ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే ఈ
సినిమా ఆ రెండు చిత్రాలని మించి ఉంటుంది. లింగా చిత్రానికి సంభందించి మొదటి లుక్ ని ఈ వినాయక చవితి కి రిలీజ్ చేసాము. చూసిన ప్రతి ఒక్కరు తలైవా , సూపర్ స్టార్
రజని కాంత గారి లుక్ అదిరిపోయింది అంటున్నారు. అంతే కాకుండా ఒక్కరోజులోనే రికార్డు హిట్స్ ఇచ్చి కొత్త రికార్డు ని సృష్టించారు. ఇంతటి ఆనందాన్ని మాకు , మా టీం కి ఇచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు, రెహమాన్ గారు అందించిన సంగీతం దీపావళి కి విడుదల చేసి, సినిమా ని సూపర్ స్టార్ రజని కాంత్ గారి పుట్టిన రోజున విడుదల
చేస్తాము” అని అన్నారు

ముని రత్న సమర్పణ , మ్యూజిక్: ఏ.అర్.రెహమాన్, కథా -రచన : పోన్ కుమరన్ , కెమెరా : అర్. రత్నవేలు B sc, D F Tech ఎడిటింగ్ : సంజిత్ Mhd, నిర్మాత : రాక్ లయన్ వెంకటేష్ , స్క్రీన్ ప్లే – దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్ ..


Comments are closed.