Teluguthalli kallalo raktashruvulu

Teluguthalli kallalo raktashruvulu

తెలుగుతల్లి కళ్ళల్లో రక్తాశ్రువులు…
భారతమాత గుండెల్లో పిడిబాకులు..
కనుసైగ తో చలనమాపివేస్తే..
వేలుచూపి అంతటా గమనామాపివేస్తే..
వస్తుందా రాజ్యం..
బాధ పెట్టి క్షోభ పెట్టి రాష్ట్రం సాధిస్తే..
అవుతుందా ఆ రాష్ట్రం సస్యస్యామలం..
నాగరికతకు, సంస్కృతికి బాటలు వేసిన
ఎందరో కవులు..ఎందరో నాయకులు..
దండమెట్టి గుండెల్లో ఉంచవలసిన దేవుళ్ళు
నేల రాలి..ఆక్రందన చేస్తుంటే నేస్తం
అంటారా దీన్ని కొత్త ప్రజాస్వామ్యం..
ఏమైపోతుంది ఈ సభ్యసమాజం…
ఎక్కడికిపోతుంది దౌర్భాగ్యపు భారతం..

ప్రాణం పోతుందని పరిగెత్తే నిర్భాగ్యులు..
బతుకుబాట మూసుకుపోయి బాధపడే విద్యార్థులు..
నోటిలోకి వేళ్ళు పోక ఏడ్చే అన్నార్తులు
నిలువనీడ లేక కష్టపడే పేదవారు..
రాష్ట్రమేది అయినా కష్టపడే కృషీవలురు..
రాజకీయ యుద్ధం లో ఓడిపోయి సైనికులు..
ఎవరు దిక్కంటూ ఏడ్చే చిన్నారులు..
కనిపించరా నేతలకు, నాయకులకు, వీరులకు
ఇక్కట్లు,బాధలు కనిపించవా దేవుళ్ళకు
ఏమైపోతుంది ఈ సభ్యసమాజం..
ఎక్కడికి పోతుంది దౌర్బాగ్యపు భారతం..

సంస్కృతికి ప్రమిధలైన విగ్రహాలు,నాయకులూ
దేశభక్తి నిండిన మారదర్శకాలు
ఉన్మాదుల దెబ్బలకు నేలరాలి రోదిస్తే
జేజేలు కొట్టాల్సిన జనమే ఉమ్మేస్తే..
చూపిన దారిలో గోతులే తవ్వుతుంటే…
తెలుగుతల్లి కళ్ళలో రక్తాశ్రువులు..
భారతమాత గుండెల్లో పిడిబాకులు..

తెలంగాణా నాదని సమైఖ్యాంధ్ర నీదని
జుట్టుపట్టే నాయకుడా..
చస్తే నువ్వు నేను చేరేది భూమి వొడిలో
తెలంగాణా కాదు..ఆంధ్రమాత కాదు..
ఒక్కటే నీకునాకు తల్లి భూమి తల్లి దైవం..
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రాక్షసులను
క్షమించదు క్షమించదు…క్షమించదు
కాలం..
మన్నించదు..మన్నించదు..మన్నించదు దేశం..

by Brahma Mahesh
khaderbad@gmail.com


2 Responses to “Teluguthalli kallalo raktashruvulu”

 1. suja says:

  ఇక్కడ మీకు , మీ గొప్ప చరిత్రలకు
  స్తానం లేదు..అందమైన విగ్రహాలకు
  విడిది కాదు నా ఇల్లు,
  ఆగమైతున్న బతుకు చిత్రాలకు
  కొలువు..

  భుతల్లి కన్నీట మునుగుతున్నాం
  గర్భ శోకంతో కుంగి పోతున్నాం..
  మోసాలకు ఎత్తులకు జిత్తులకు
  విసిగి వేసారి ఉన్నాం..
  కొలిమిల్లాగా మండుతున్నాం..
  దగ్గర కొస్తే ఆగం అయితారు..

  మాట్లాడే సహనం లేదు,
  బ్రతిమిలాడే క్వాయిష్ అంత కన్న లేదు
  మిగిలినవి చేతలు , చేతులే ..
  ఆవేశం అంటుకున్నది
  ఆవేదన అలుముకున్టున్నది..
  మంచి చెడుల మధ్య
  చెరిగిన రేఖ..
  న్యాయ అన్యాయాల మధ్య నలిగిన
  సత్యం..

  ఇప్పటికైనా …
  నా భూమ్మీద నా బిడ్డలకే హక్కు..
  మేమూ ప్రజా కవులను ప్రేమిస్తాం..
  మీ చరిత్రనూ నిలబెడతాం..
  మా చేతుల మీదుగా
  మేము ప్రశాంతంగా
  స్వేచ్చగా గాలి పిలచిన రోజు..

  …సుజాత సూరేపల్లి

 2. sudhakar.p says:

  hai…mee kavitha chala bagundhi…and meeru kavithani post chesina march13 roje…na birth day kuda…very nice to have u…