Featured News

సత్తా చూపిన తెలంగాణా మార్చ్!

సత్తా చూపిన తెలంగాణా మార్చ్!

వాడెవడు వీడెవడు తెలంగాణకు అడ్దేవడు! తెలంగాణాని ఆపే దమ్ము ఎవడికుంది? బరికేడ్లకా , పోలిసులకా , దిమాక్ లేని కిరణ్ కుమర్లకా , అరవిర భయంకరుడు, రక్త పిపాసి అని చెప్పబడే అరవిన్దరవుకా, చంచ గిరి చేసే, దగుల్బాజీ సీమాంద్ర నాయకులకా…తెలంగాణా పేరు చెప్పుకుని పబ్బం గడిపే సత్తా లేని మన నాయకులక..అట్లాంటి అపోహలన్నిటికి ఇవాళ తెర తీసి నట్టయింది..ఏమనుకున్టున్రు తెలంగానోల్లంటే..దటిస్ తెలంగాణా! నేను లేకపోతె తెలంగాణాల ఉద్యమం నడువది అనుకున్న పెద్ద పెద్దోల్లందరికి లాగి చెంప మీద చెళ్ళున కొట్టినట్టయింది..రాజకీయ నాయకులకి దిక్కు దివాణం లేదన్న! నన్ను నమ్మున్ద్రి..ఇవాళ తెలంగాణా మార్చ్ చూడడం అంటే జీవితం లో ఎంత పెద్ద గొప్ప అనుభవమో చెప్పనికి ఒక్క మాట ఒస్తలే , ఏమి సంబూరాలు, సక్కని గుంపులు, డప్పులు, దరువులు..మైకులు లేకపాయే అని ఎం బాద లేదే, ఒక్కో గొంతు అందుకుందంటే ఇన సొంపైన పాటలు..

నిన్నటి నుంచి పొలీసుల ఓవర్ అక్స్యన్ చూస్తుంటే ఒకటే గుబులు, ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు , అర్రేస్తులు, దాదాపు అన్ని యునివర్సిటీ విద్యార్థులు , విద్యార్థి నాయకులు అర్రెస్ట్ అయినరు, ఉద్యమ కారులు అనుకున్నోల్లు దొంగల లెక్క దాసుకుని దాసుకుని వస్తున్నారు..నిన్నటినుంచి దాదాపు కర్ఫ్యూ వాతావరణం..ఎవడికి ఇబ్బంది పెట్టకుడదని అనుమతి ఇవ్వలేదని ముక్య మంత్రి గారు చెప్పడం చూస్తె చాన జాలేసింది..వీడు మంత్రి ఎట్లా అయిందో దయ చేసి ఎవరికన్నా అర్థం అయితే జర చెప్పుండ్రి..ఎక్కడ లేని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి పట్నం ల ఒక్కడిని సక్కగా తిరగ నీయలే..రాత్రి అంత సరిగ్గా నిద్రనే లేదు, పొద్దున్న లేవగానే అన్ని ఊర్ల కెంచి ఫోన్లు, ఏడ కలుసుకుందాం అని..తోచిన కాడ కలుసుకున్డంలె అనుకున్నాం, డిపి రెడ్డి గారికి ఫోన్ చేసిన..అందరం ఆడనే కలుద్దమనుకున్న గాని, మధ్యలో ఆగి ఇంకొద్ది మంది మిత్రులని చూసి పోదామని హిమాయత్ నగర్ ల ఉన్నా , జమున పుష్కర్ కూడ వచ్చిందని తెలుసుకొని మాట్లాడిన, విమల, దేవకీ దేవి వాలు జర ఆటు పోయిన్రు, గమ్మతి ఏందంటే ఎవరికీ తెలవదు ఏడికి పోవాలనో, ఎట్లా పోవాలనో, మొత్తానికి అందరం అర్రేస్ట్లకు సిద్దమయే బయలు దేరినాము, నా కైతే నిన్నటి నుంచే ఇంటెలి జేంస్ వాడు తలకాయ తిన్తనే ఉన్నాడు, నువ్వు ఏడికి పోతున్నవ్, ఎంత మందిని తీస్క పోతున్నవ్..సంవత్సరం నుంచి అలవాటు అయింది కాబట్టి పెద్ద కష్టం కాలే వాడిని హండిల్ చేయడం..

..హిమాయత్ నగర్ రానికి ఒక్క కష్టాలు కావు, అన్ని చోట్ల పోలీసులు దార్లు మలుపుతున్నారు, చెప్పలేనంత బాద అయింది తమ్మి! నా హైదరాబాదుకు , నట్ట నడుమ ఉన్న నా ట్యాంక్ బండ్ కు రానికి ఇన్ని తిప్పలు , ఇన్ని బాధలని అని ఒక సారి దుక్ఖం ఒచ్చింది.. ఎక్కడి బతుకులు, ఏడికి వొచ్చినయి, వాని బొంద పెట్ట, ఇరాని చాయిలు పాయె, రోడ్డు మీద చాట్ బండిలు పాయె..సక్కని ఫుట్ పాత్ లు బోయి అమెరిక కంపనీలకు బజార్లన్నీ అమ్ముడు పాయె..ఒక్క షాపు చూడానికి కూడ మనసైత లేదు ఇయాల రేపు..ఎట్లనో మహేష్ కార్ల తీసుక పోత అన్నడు, నేను, భరత్, మహేష్ ఎన్నో గల్లిలు తిరిగి మొత్తానికి టాంక్ బండ్ చేరుకున్నాము. చిన్న ఇరుకు ఇరుకు మెట్ల కెంచి ఒక్క సారి పైకి ఎక్కంగనే, ఒకటే సంతోషం ఎవరెస్ట్ ఎక్కినంత..హుస్సేన్ సాగర్ చల్ల గాలి పేయి కి తగలంగనే ఒక్కసారి ‘స్వేచ్చ’ గాలి చుట్టుకున్నట్టు అయింది, ఆంధ్రా కంపు వాసనలు, అరువు తెచ్చుకున్న మొహాలు, ప్రేమలు ఏవి కన పడ్త లేవు, సంకెళ్ళను తెంచు కున్న సంతోషం, గెలుపు మాదే అన్న ధీమా, చెవుల్లో మార్మోగుతున్న నినాదాలు..ఎవడబ్బా సొమ్మురా తెలంగాణా మాదిరా, కదిలిందిర తెలంగాణా , ఖబడ్ దార్ , ఖబడ్ దార్, ఔర్ ఎక్ ధక్కా , తెలంగాణా పక్కా…గొంతులు చించుకుని అరుస్తున్నారు, స్వేచ్చా వాణి టాంక్ బండ్ అంతా మార్మోగుతున్నది, అది ఒక సెమినార్ కాదు, మీటింగ్ కాదు, ఒక నాయకుడు లేదు, ఎవరు ఏమైనా చేయొచ్చు, ఎక్కడికి అయిన పోవచ్చు.. అంతా నావోల్లె..అంత నా జాగనే..మొట్ట మొదటనే మా భూమి సంధ్యక్క గ్రూప్ కలిసింది, అక్క పాడుతుంటే అందరు డాన్స్ ఎసినం..సంధ్యక్క పాట గురించి చెప్పేదేముంది, రేపు చస్తా అనేతోడు కూడ లేచి డాన్స్ ఎస్తాడు..

మీ అందరి మీద ఒట్టేసి చెపుతున్నా , ఒక్క అన్ద్రోది మొకం కాన రాలే అంత మందిల..రేపు గిట్ల నా తెలంగాణాల అంద్రోలు లేకపోతె ఇంత బాగుంటదా ఏంది అనిపించింది.. తీరొక్క జెండాలు, పార్టీలు అక్కడక్కడ ఉన్నాయి, లాయర్లు, విద్యార్థులు, సింగరేణి, టీచర్లు, వర్కర్లు..ఇకటి కాదు రెండు కాదు , చూడ నికి రెండు కండ్లు చాల్త లేవు..మరో వైపు మహిళ జాక్, జలజ పాట జోరుగా అందుకున్నది, మద్యల నేర్నాల కిషోర్, రామక్క బృందం బతుకమ్మ పాట పాడి మస్తు ఆడిపిన్చిన్రు..మస్తు ఎండల కూడ ఎవరు అలిసి పోతలే, దాదాపుగా అన్ని ఊర్ల నుంచి జనం వచ్చిన్రు, లొల్లి లొల్లి..నాకు తెలిసిన ప్రతి ఉద్యమ కార్య కర్త కనపడ్డారు..ఈ మద్యల అందరిని కలుసుడు అంటే తెలంగాణా మీటింగులే! ఇవే పెండ్లి పేరంటాలు..ముచ్చట్లు, వీర గాధలు ఒక్కొక్కరం ఎన్ని కష్టాలు పడి వచ్చినమో చెప్పుకొని మురిసి పోవుడు..ఇంతలనే రేవతి అక్క ఫోన్ చేసింది, ఏడికి రావాలే అని, చెప్పినం..తిరిగి తిరిగి ఎడినించి రానీయట్లేదని ఒక్కతె ఇంటికి పోయిందంట..మస్తు బాద అయింది..రేవతి, ఒక ప్రొఫెస్సర్, తెలంగాణాల ఏదో ఒక పని చేస్తనే ఉంటది సైలెంట్ గా, రాస్తానే ఉంటది, మాట్లడతనే ఉంటది..ఇంత పెద్ద ఎత్తున మంది కదిలోస్తే చూడానికి దార్లు బందు బెట్టిన్రు, అట్లా ఎంత మంది ఎనక్కి పోయిన్రో బిడ్డలు, ఎంత చిన్న బుచ్చుకున్నారో, ..ఎవడబ్బ సొమ్మురా ఈ హైదరాబాద్? మా ఇంట్లకొచ్చి, మా హైదరాబాద్ చుట్టు ముళ్ళ కంచెలు కడతార..ఖబడ్ దార్ ఒక్కొక్కడికి గోరీలు కట్టే రోజులోచ్చిని..మంచిగా పొతే మంచిది, లేకపోతె ఎట్లా తోలాల్నో మావోల్లకి బాగా తెలుసు..

తెల్లని పాల పిట్ట ఓలే గద్దరన్న తెల్ల లాల్చి ఏసుకొని ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ అని అందరితోని పాడిపిస్తుండు, అయన చుట్టూ జనం మస్తుగున్నారు, ప్రతిజ్ఞ చేసింరు, ఒక్క మీడియా కూడా రాలే నాకు తెలిసి..అవును అయన పాడిపించి, ఆడిపించి, తెలంగాణాని రగిలిన్చోడే కాని మాటలు నేర్చిన రాజ కీయ నాయకుడు కాదు కదా..అయినా టీవి ని లెక్ఖ బెట్టినోడేవడు..ఎవ్వని ఖుషి వానిదే, ఆడోల్లు ఒక తాన ఆడుతానే ఉన్నారు, ఎవరికీ వారు పాడతనే ఉన్నారు. ఇంతలో కాంగ్రెస్ నాయకులకి బుద్ది చెప్పి పంపింరని, ఇంకింత సంబురం..కష్ట పడి ఓట్లేసి, నాయకులను చేసి గెలిపిస్తే..కనీసం ఒక్క పర్మిషన్ కూడ ఇప్పించ లేరు, పరీక్ష వాయిదా వేయించ లేరు, డిజిపి తో మాట్లాడ లేరు..ఇంక సోనియా దాక ఎందుకులే ముచ్చట.. ఇంతకి వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి..అయినా అందరి నాయకులకి ఇదే గతి పడతాడని భయపడ్డాం , కాని ఎం కాలే..దొంగలు బద్దంక పోలిసోల్లు ఒచ్చినట్టు మా నాయకులు లెట్ ఎంట్రి ఇచ్చింరు, ఎప్పటి లేక్ఖనే జర మంది కూదిన్రు, కాని అప్పటికే అందరికి తెలిసి పోయింది, ఇంక ఎక్కువ రోజులు నాటకాలు ఆడవని! ఇంకో వైపు చూస్తె హరీష్ రావు , ఇటల బోట్ల వస్తున్నారని విని మస్త మజా వచ్చింది, నయం ఇంక పైనుంచి రాలేదు, అయిన ఎక్కడి కష్టాలు మా నాయకులకి, ఎంత చెప్పిన తక్కువే వాళ్ళ గురించి..నవ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం ఆన్ థెం, ఇది ఏ రాజ కీయ పార్టీ కష్టమూ కాదు..కేవలం ప్రజా విజయం, పార్టీలు స్వార్థ పూరిత ఆలోచనలతో వెనక అడుగేస్తే , మేమున్నాం అనుకుంటూ ముందడుగు వేసేది ఎపుడు ప్రజలే..

అంత అయిపొయింది అనకుంటే కొంత మంది విగ్రహాలు ద్వంసం చేస్తున్నారని వార్త, కడుపు మండుతుంటే ఎం చేస్తారు, అయినా ఇది కూడా సీమ ఆంద్ర ప్రభుత్వం ఆడి పిస్తున నాటకం ఎందుకు కాకూడదు? అవును, నాలుగు విగ్రహాలు ద్వంసం అయితే అన్ద్రోల్లు గాంధి తాతకి పాలు అభిషేకం చేస్తున్నారు, కొవ్వొత్తుల ప్రదర్శన అంతా, టీవిలకి ఇంక పండగా, ఒక్క విగ్రహం పొతే ఇంత బాద పడితే , మా భాష, యాస, బతుకులు పోయినందుకు మేము ఎన్ని పాల సముద్రాలు అప్పు తెచ్చుకోవాలె? ఒక టీవి వాడు “మార్చిచ్చు” అంటడు, ఇంకోడు “రణ మార్చ్” అంటడు, మరోడు “ఉద్యమమా ;విద్వంసమ” , “డెమ లిష్ మార్చ్ “ అన్ని చానళ్లల్ల చర్చలే చర్చలు..పొద్దున్నుంచి ప్రజలు ఎంత కష్టపడి తమ ఇంట్లకి తాము వచ్చి పోలిసోల్లని ఏడ బెట్టాల్నో ఆడ పెడితే, ఒక్కడు వేయడు, ఊర్ల కి పోతున్న వాళ్ళని అర్రేస్ట్లు చేసి చిత్ర హింసలు పెడితే పట్టించు కోరు, తెలంగాణా అంటే మావో ఇష్టులు అని పర్యాయ పదాలు వెతుక్కొంటే ఎట్లా, నేను ఎప్పుడో చెప్పిన, ప్రశ్నించే వాడే, అన్యాయాన్ని ఎదిరించే వాడే నక్ష లైట్ అయితే మేము నాలుగు కోట్ల మందిమి నక్ష లైట్లే..అసాంఘిక శక్తులు ఉన్నాయి అంటడు మా డిజిపి..మా భూములు గుంజుకొని, ఉద్యోగాలు గుంజుకొని, మమ్మల్ని దూర దేశాలకు పనికి పోయేటట్టు చేసిన మీరా , మేమా అసాంఘిక శక్తులు ? అమ్మ , అయ్యలకి దూరమై, అంద మైన నా షహర్ , శౌహర్ కి దూరమయి బతుకుతున్నాం, మీరు దొంగలా మేమా? మా నాయకుల బొమ్మలు పెట్టలేదని బాద ఎక్కువైంది , ఏమ్చేస్తారు అన్న? కెమెరాలు పోయినాయ్ ఒకే, ఉంటె కూడ ఎం లాభం చెప్పు, ఒక్కటన్నా మా ఉద్యమం సక్కగుందని ఏసే తోల్లా ? అయినా మీరు ఏది ఎయాలనుకున్నారో అదే ఎసిన్రు, మా వోల్లాని బోను లో నిలబెట్టి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతున్రు..ఒక వేల ఇది మా వొల్లె చేసుంటే, ఇదే ఈ ఆంధ్రా మీడియా కి గుణ పాఠం..

ఎవడు ఏమి కూసినా, ఈ గడ్డ మాది, అన్ని అదికారాలు మావి, తెలంగాణా రోజు రోజు కి ముందుకి పోతున్నది, అడ్డం వస్తే మరి ఎం చేస్తాడో ఇవ్వాల చూడనే చూసిన్రు.సోనియమ్మ కళ్ళు తెరిచి నపుడే తెలంగాణా ఇచ్చేతట్టయితే మాకు ఏ రాజ కీయ పార్టీలు అవసరం లేదు, రోజు కో పానం పోతుందీ మా పిలగాల్లది, ఎం చేస్తావ్ కాపాడానికి? మీరందరినీ హంతకులుగా నిల బెడతాము..మీరు సక్కగా ఉంటె మాకు ఈ గతి ఎందుకు పడతది?

ప్రజలు ఒక్కటిగా ఉన్నారు, కొందరు నాయకులు ఉన్నారేమో అని అపోహలు పడుతున్నారు, అంత లేదు..నిస్వార్థం గా ప్రజలు ముందుకొచ్చి పోరాడుతున్నారు.. కుల మతాలకి అతీతంగా, అందరిని కలుపుకుందాం, రాజ కీయ పార్టీలను పక్కన పెడదాం, ప్రజా పోరాటాలని నిర్మిద్దాం.. కేంద్రం ఇయాల కదుల్తడి, నేషనల్ మీడియా వచ్చింది కదా..ఇంక ఎవడి రాజ కీయ ఎత్తుగడలు ఇపుడు అవసరం లేదు..ఆరంభ శూరత్వం! ఏమి లేదు..

“భయాన్ని జయిస్తే అతి ప్రమాద కరమైన శత్రువుని జయించి నట్లే” అని ఎవరో అన్నాట్లు, మేం జయిన్చాం, మాకు పోలిసులంటే భయం లేదు, రాజ కీయ నాయకులు అంటే ప్రేమ లేదు, మా ప్రాణాల్ని ఫణం గా పెట్ట కుండా, నువ్వు కూడ తెలంగాణా తెచ్చే టందుకు లాడాయికి సిద్దం కా తమ్ముడు..

ప్రాణం ఖరీదు చెప్ప గలరా? ఎస్, ఒక ప్రాణం ఖరీదు తెలంగాణా! ఒక ప్రాణం ఖరీదు ఒక రాజ కీయ నాయకుడి హత్య/బహిష్కరణ, కొత్త తరం కోసం అన్వేషణ..లేకపోతె పైన ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు మనల్ని క్షమించారు..

జోర్ సే బోలో , ప్యార్ సే బోలో జై తెలంగాణా!

డిల్లి మే బోలో గల్లి మే బోలో జై తెలంగాణా!

ఉంటా మరి,
సుజాత సూరేపల్లి


Comments are closed.