అవేమీ పూజా విగ్రహాలు కావు!

అవేమీ పూజా విగ్రహాలు కావు!

దోపిడీకి గురైన జాతికి వత్తాసుగా ఉండాలనేది జర్నలిజం ప్రాథమిక సూత్రం……… ఆ జాతి తన ఉనికినీ, తన బాధనూ వ్యక్తీకరించే క్రమంలో కొన్ని తప్పులు చేయవచ్చు, ఐనంత మాత్రాన ఇలా గగ్గోలు పెట్టడం ఏమిటీ? తరాల, యుగాల సంఘర్షణలో గుడులూ, విగ్రహాలూ, ఆనవాళ్లూ కూల్చివేయడం అత్యంత సహజం…. ఒక ప్రాంతం ఎందుకింత గొంతు చించుకుంటుందో ఎవడికీ అర్థం కాని విషయం! ఎన్ని బౌద్ధారామాలూ, ఎన్ని బుద్దుడి విగ్రహాలు సోకాల్డ్ హిందుత్వవాదులు కూల్చేశారో చదవండి మేడం…. శివుడి విగ్రహాల్ని వైష్ణవులు, నారాయణుడి విగ్రహాల్ని శైవులూ ద్వంసం చేసారో తెలుసుకొండి…. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా సహజం. ఆ లెనిన్ విగ్రహానికే తప్పలేదు…. ఇక్కడ జరిగిందీ తప్పు లేదు…….. విగ్రహానికున్న పవిత్రత, దైవత్వం ఏమీ లేదు, అదేమీ మంత్రోచ్చరణల నడుమ ప్రతిష్టించిన మహిమాన్విత మూల విరాట్టులేమీ కావు….. అంతెందుకు, మన సంస్కృతి ఆనవాళ్లను నాటి ముస్లిం పాలకులు ఎంతగా ద్వంసం చేశారో మీకు తెలియదా? ఒక్కసారి వరంగల్ కోటకు వెళ్లి రండి, రామప్ప ఆలయానికి వెళ్లి రండి…. విగ్రహాలు దేనికీ అతీతమేమీ కాదు…. అసలు రష్యాలో లెనిన్ విగ్రహాన్ని కూల్చేస్తేనే దిక్కులేదు…. ఇక్కడ ఎందుకింత మొత్తుకోవడం…? ఆ దేవుళ్లు శపిస్తారా…?! కానివ్వండి, మరేమీ పర్వాలేదు…. ఇబ్బందేమీ లేదు….
ఏ చరిత్ర చూసినా సాంస్కృతిక ఆనవాళ్ళను ప్రజలు నచ్చితేనే ఉంచుకుంటారు… ఇది చరిత్ర చెప్పిన నిజం, నచ్చకపోతే కూల్చివేసి, ఏ చెరువులోనో నిమజ్జనం చేస్తారు…
గతం అదే, వర్తమానం అదే, భవిష్యత్తూ అదే!!!

– సుజాత సూరేపల్లి


2 Responses to “అవేమీ పూజా విగ్రహాలు కావు!”

  1. Karthik says:

    VEry Well said sujatha

  2. suri says:

    sujata garu mee explanation chala baagundi. Lenin lanti goppa naayakudi vigraham kulchesty dikkuledu annaru, muslim mata chandasam to hindu devalayalu kulchesaru annaru, same thing followed by siva’s, buddishts, vaishnavas and so on. So, by your words every one must follow the way of our fathers even it is a bad one. We people don’t need to think about what is wrong and what is right. Even it is a wrong path we must follow like a goat