Featured News

పరమాణు శక్తి భారతదేశానికి బంగారు భవిష్యత్తు అందిస్తుందా..జపాన్ నుండి మనం నేర్చుకోవాల్సినది ఏమిటి

పరమాణు శక్తి భారతదేశానికి బంగారు భవిష్యత్తు అందిస్తుందా..జపాన్ నుండి మనం నేర్చుకోవాల్సినది ఏమిటి

గతవారం ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. జపాన్ లో భూకంపాలు కొత్త కాకపోవచ్చు, సునామి మొదటి సారి కాకపోవచ్చు కాని ఆ సునామి సృష్టించిన విధ్వంసం ఆ తర్వాత తలెత్తిన అణు విపత్తు ప్రపంచానికి కొత్త ప్రమాదాన్ని చూపించింది. ఈ విశ్వంలో ప్రకృతి ని మించిన శక్తి వేరొకటి లేదన్న సత్యాన్ని ప్రపంచానికి మరోసారి నిరూపించింది.

21 వ శతాబ్దాన్ని విజ్ఞాన విప్లవ శతాబ్దం గా పిలవచ్చు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. విజ్ఞానం ప్రపంచాన్ని చాల చిన్నది గా చేసింది. దేశాల మధ్య ఉన్న హద్దులను మనుషులు చెరిపేశారు. అంతర్జాలం మనిషి జీవితాన్ని, సృష్టి ని మార్చి కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. ఇంతకూ ముందు అసాధ్యం అనుకున్నవి మనిషి సుసాధ్యం చేసేందుకు ఉపక్రమించాడు. క్లోనింగ్ తదితర విజ్ఞాన ఆవిష్కరణములు మనిషి ప్రకృతికి దగ్గరగా వచ్చినట్లు చిత్రించాయి. మనిషి ప్రకృతిని ఎన్నో రకాలుగా చాలెంజ్ చేసాడు. క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాన్ని కురిపించడం కాని, క్లోనింగ్ ద్వారా జీవాన్ని సృష్టించడం కాని, డి యెన్ ఏ మాపింగ్ ద్వారా తమకు కావాల్సిన గుణగణాలను జీవాలలో జొప్పించే ప్రయత్నంలో కాని మనిషి ప్రకృతి ని జయించే ప్రయణం చేసాడు. పరమాణు శక్తి ద్వారా ప్రపంచంలో ని ఇంధన సమస్య తీర్చవచ్చు అంటూ ప్రపంచాన్ని నమ్మించాడు. పరమాణు శక్తి ప్రపంచానికి తెలిసినా, అందులో ఉన్న కీడు ను శంకించిన ప్రపంచానికి, అణు ప్రమాదం జరగకుండా చేపట్టిన చర్యలు , కంట్రోల్స్ గురించి ఊధరకొట్టి అనుమానించిన వాళ్ళను గేలి చేసారు అభివృద్ధి చెందినా దేశాలు.

ఈ రోజు మన కాళ్ళ ముంచు నిల్చున్న సత్యం ఫుకుషిమ అను కేంద్రం లో జరుగుతున్న ప్రమాదం. మూడు రియాక్టర్ లలో ప్రమాదం జరగగా దాదాపు లక్షా యాబై వేలమందిని అక్కడినుండి తరలించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ ఎదురుకున్న అతిపెద్ద ఆపద కా దీనిని చిత్రించారు. బహుశా రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్ద ఆపద కూడా కావచు. ఈ ఆపద ప్రాణాంతకం అయ్యినది భూకంపం వాళ్ళ కాదు సునామి వాళ్ళ కాదు, కేవలం పరమాణు ప్రమాదం వల్లనే అన్న సత్యం గుర్తు ఉంచుకోవాలి. జపాన్ లాంటి అభివృద్ధి చెందినా దేశం ప్రమాదం నివారించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఉంటుంది. మనకు తెలిసి జపాన్ లో విజ్ఞానం, సాంకేతిక విప్లవం మనకంటే కొన్ని దశాబ్దాల ముందు ఉన్నదీ అన్నది వాస్తవం. అలాంటి జపాన్ దేశం ఈ రోజు ఈ ప్రమాదం మరింత పెద్దది కాకుండా అయ్యేందుకు అన్ని శక్తులు ఒడ్డుతోందంటేనే అర్థం చేసుకోవచ్చు పరమాణు శక్తి హద్దు దాటితే ఎంత ప్రమాదమో. అలాంటి పరమాణు శక్తి వెనక మన దేశం పరిగెడుతోంది. పరమాణు ఒప్పందం ద్వారా మన దేశం లో ఇంధన అవసరాలు తీరుతాయని శాస్త్రజ్ఞులు, నాయకులూ చెపుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు కాని ప్రమాదం జరుగుతే తట్టుకునే శక్తి, ప్రమాదాన్ని నివారించే నైపుణ్యం మన వాళ్ళ లో ఉన్నాయా అన్నదే నా సందేహం. నిప్పు తో ఆటలు మంచిదే కాని దానిని ఆర్పే శక్తి లేకుంటే అది మనల్నే మసి చేస్తుంది. అత్యంత హీనమైన క్రమశిక్షణ కల్గిన దేశం మనది. నిర్లక్ష్యం మన జన్మ హక్కుగా ప్రవర్తిస్తుంటాం. అలాంటి మనం ఈ పరమాణు శక్తి తో ఆడుకోవడం మంచిదేనా, ఏదైనా ప్రమాదం జరిగితే మనం తక్కుకోగలమా అన్నదే నా సందేహం. నా ఉదేశ్యం లో ప్రమాద నివారకాలు, సురక్షా పద్దతుల గురించి కచ్చితంగా ఉన్నపుడే మనం పరమాణు శక్తి గురించి తీవ్రంగా పనిచెయ్యాలి. మన తయారి మరియు జాగ్రత్తలు మాత్రమె మన భవిష్యత్తును నిర్ణయించ గలుగుతాయి. మనం బాగా తయారు అయితే పరమాణు శక్తి భారతదేశం భవిష్యత్తు సువర్ణ మాయం చెయ్యగలదు. హడావిడిగా, పూర్తిగా తయారు కాకుండా అడుగుపెడితే మానవాళి భవిష్యత్తు కే ఒక పెద్ద ఆపద కాగలదు.

by Brahma Mahesh
khaderbad@gmail.com


Comments are closed.